ఆవ నూనెలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంతో సహాయపడతాయి. తర్వాత గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం.. ఆవనూనెలోని వేడి లక్షణం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు సైతం తగ్గుతాయి.
ఈ నూనెను వెల్లుల్లి, వాము లేదా కర్పూరంతో కలిపి ఛాతీ, వీపు, అరికాళ్లకు మర్థన చేయడం వల్ల జలుపు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ నూనె చర్మాన్ని సహజంగా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం తదితర ఖనిజాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ నూనెలో అసంతృప్తి కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
ఆవ నూనెలో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.