పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది చాలామంది నిపుణులు చెబుతున్న మాట. ఉప్పు వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.

 రిఫైన్డ్​ సాల్ట్​ మన ఆరోగ్యానికి హానికరం. రిఫైన్డ్​ ఉప్పు కాకుండా హిమాలయన్​ సాల్ట్​, రాక్​ సాల్ట్​, పింక్​ సాల్ట్​, అన్​రిఫైన్డ్​ సాల్ట్​ వాడటం మంచిది

 అయితే రోజూ పరగడపునే ఉప్పు కలిపిన నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయాన్నే ఉప్పు నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్యలు దూరమవుతాయి. జిమ్‌కి వెళ్ళేముందు తాగితే, వర్కౌట్ ఎనర్జీ డబుల్ అవుతుంది

ఉప్పు నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCl) ఉత్పత్తిని పెంచుతుంది

గ్యాస్‌ట్రిక్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి

చర్మ సమస్యలు ఎక్జిమా, స్కిన్ పసారియాసిస్ వంటివి తగ్గుతాయి, మినరల్స్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, అలర్జీ వంటి శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

 గొంతు నొప్పి ఉన్నప్పుడు ఉప్పునీటితో పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బూస్ట్ చేస్తుంది

ఉదయం పరగడపునే తాగాలి. అయితే అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్న వాళ్లు ఉప్పు నీటి జోలికి పోకపోవడమే మంచిది.