మష్రూమ్ (పుట్టగొడుగులు) సూప్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో సెలీనియం, విటమిన్ డి, బి6, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇది యాంటీ ఆక్సిడెంట్ల నిధి. సెలీనియం, ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్ వంటివి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాలరీలు తక్కువ, కొవ్వు రహితం, కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల ఆకలిని తగ్గించడం ద్వారా బరువు నియంత్రణకు దోహదపడుతుంది.
వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి.
మెదడు పని తీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది. పొటాషియం, విటమిన్ డి వంటివి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడతాయి.
క్యాన్సర్‌ను తగ్గించడంలో పట్టగొడుగులు కీలకంగా వ్యవహరిస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడి అయింది.
మష్రూమ్ సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
వీటిని అధికంగా తీసుకుంటే కొన్నిసార్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపించవచ్చు. కాబట్టి మితంగా తీసుకోవడం ఉత్తమం.