శీతాకాలంలో గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

ఇంగువ జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి గ్యాస్, కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి వాటికి ఇంగువ నీరు మంచి ఔషధం

ఇది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది

దీనిలోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఇంగువ రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

మహిళల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలోనూ ఇంగువ సహాయపడుతుందని నమ్ముతారు