శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విరిగినప్పుడు ఏర్పడుతుంది.
ప్రస్తుత రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.
ఈ పదార్థం రక్తంతో కలిసి ముత్రపిండాలకు చేరుతుంది. సాధారణంగా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది
శరీరం నుంచి అది పూర్తిగా బయటకు పోకపోతే దాని మోతాదు పెరుగుతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు శరీర కీళ్లలో నొప్పి మొదలవుతుంది.ఒక్కొక్కసారి కూర్చోవడం, లేవడం కూడా కష్టంగా మారుతుంది.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె సమస్యలు, రక్తపోటు, ముత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా వస్తాయి.
కాకరకాయ మధుమేహం ఉన్నవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లాంటి పని చేస్తాయి
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అర కప్పు కాకరకాయ రసం తాగితే మంచిది. చేదు తక్కువ చేయాలంటే కొద్దిగా నల్ల ఉప్పు లేదా నిమ్మరసం కలపాలి. ఇలా తాగితే గౌట్, ఆర్థరైటిస్ సమస్యలపై లాభం ఉంటుంది.