రొయ్యలు మన ఆరోగ్యానికి  ఎంతో అవసరం.

మెదడు శక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తాయి. 

రొయ్యల్లో ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ఒమేగా 3 వంటి ఎన్నో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి.

గర్భిణులు రొయ్యలు తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్, అయోడిన్ శరీరానికి అవసరం.

ఇది థైరాయిడ్ హార్మోన్ల స్రావాన్నిపెంచుతుంది. ఈ హార్మోన్లు శిశువు మెదడు అభివృద్ధికి అవసరం.

రొయ్యలను చాలా శుభ్రంగా వండాలి.. బాగా ఉడకబెట్టాలి. అప్పుడే తినడం సురక్షితం.

రొయ్యల్లో కొవ్వు తక్కువగానే ఉంటుంది. కొలెస్ట్రాల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు దీన్ని తినడం మానాలి