మామిడి పండులోనే కాదు.. దాని తొక్కలో బోలెడు పోషకాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మామిడి తొక్కలో విటమిన్ ఎ , సి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం మాత్రమే కాకుండా ఫైబర్ ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి.
మామిడి తొక్కలతో టీ తయారు చేసుకోవచ్చు. మామిడి తొక్కలను నీటిలో ఉడికించాలి. దీంట్లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
మామిడి.. కాయలతో పచ్చడి చేయడం చూశాం. కానీ తొక్కలతో సైతం పచ్చడి చేయవచ్చు.
తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవాల పొడి, మిరప పొడి, ఉప్పు నూనెతో కలిపి కొన్ని రోజులు మాగేలా ఉంచాలి. ఆ తర్వాత ఈ పచ్చడిని భోజనంలో వేసుకంటే అదిరిపోద్ది.
మామిడి తొక్కలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసి వేడి నీటిలో వేసి కాసేపు ఉడకనివ్వాలి. అనంతరం టీ తాగాలి. కొద్దిగా తేనె లేదా చక్కెర జోడించి తాగితే బాగుంటుంది.
మామిడి తొక్కలను ఉపయోగించి జామ్ తయారు చేసుకోవచ్చు. మామిడి తొక్కలను బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి. అనంతరం చక్కెర, నిమ్మరసంతో కలిపి మందమైన పాత్రలో ఉడికించాలి. ఈ జామ్‌ను బ్రెడ్, చపాతీతో తీసుకోవచ్చు.
మామిడి తొక్కలతో స్మూతీని సులభంగా తయారు చేయవచ్చు. తొక్కలను బాగా కడిగి, పెరుగు, తేనె, ఇతర పండ్లతో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ స్మూతీ విటమిన్లు,ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు.
మామిడి పండ్లతో తియ్యనైన క్యాండీని తయారు చేసుకోవచ్చు. తొక్కలను సన్నగా కట్ చేసి చక్కెర సిరప్‌లో ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఎండబెట్టాలి. ఈ క్యాండీ సహజమైన తీపిని కలిగి ఉంటుంది.