పొద్దున్నే లేవగానే  ఈ పనులూ చేయండి చాలు..  గుండె జబ్బులు రావు..!

 శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన అలవాట్లు పాటించడం ముఖ్యం. 

దీనికోసం ఉదయాన్నే సరైన సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి.

ముందుగానే దినచర్యను ప్లాన్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. 

నీరు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి రోజును ప్రారంభించే ముందు గ్లాసు నీటిని తాగి మొదలు పెట్టండి. 

వ్యాయామం కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది. రెగ్యులర్ వ్యాయామం కాలక్రమేణా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉదయం పూట చేసే వ్యాయామం మంచి ప్రయోజనంకరంగా ఉంటుంది.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య అల్పాహారాన్ని తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన అల్పాహారం మొత్తం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.