నాన్‌వెజ్‌కి సమానమైన శనగలు..  తింటే ఇన్ని లాభాలా..

  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన శనగలు తింటే బోలెడన్నీ ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు వంటి అనేక ఇతర పోషకాలు శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 గ్యాస్, మలబద్ధకం,అ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నానబెట్టిన శనగలు తింటే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది.

ఒక గ్రాము శనగలలో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఇందులో మెగ్నీషియం, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి  గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.