నిద్ర లేవగానే
ఫోన్ చూస్తున్నారా..
నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల ఎల్ఈడీలోని ప్రకాశవంతమైన కాంతి కళ్లపై ప్రభావం చూపుతుంది.
దీంతో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఉదయమే ఫోన్‌లో గడపడం వల్ల నిద్రలేమి, ఆందోళనతో పాటూ ఒంటి నొప్పులు ఎక్కువవుతాయి.
ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, తల బరువుగా అనిపించడంతో పాటూ నొప్పి కూడా కలుగుతుంది.
రాత్రి వేళల్లో ఫోన్ ఎక్కువ వాడితే నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కళ్లలో వాపు, నొప్పితో పాటూ అలసట, పొడిబారడం వల్ల దురద సమస్యలు పెరుగుతాయి.
ఎక్కువ సేపు ఫోన్‌లో గడిపితే చిరాకు, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏ పనిపై శ్రద్ధ చూపకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది.
నిద్రలేవగానే ఫోన్ చూస్తే అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనాల ద్వారా తెలిసింది.
తప్పనిసరి ఫోన్ చూడాల్సి వస్తే.. నిమిషానికి కనీసం 15 సార్లు కళ్లను ఆర్పుతూ ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
నిమ్మకాయతొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
పాలతో మామిడి పండు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
ఎండాకాలంలో ఈ జ్యూస్ అమృతమే.. రోజూ తాగితే...
వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగొచ్చా..