ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల  తలెత్తే సమస్యలు ఏంటో  తెలుసుకుందాం..

నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల ఎల్ఈడీలోని ప్రకాశవంతమైన కాంతి కళ్లపై ప్రభావం చూపుతుంది

దీంతో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఉదయమే ఫోన్‌లో గడపడం వల్ల నిద్రలేమి, ఆందోళన ఎక్కువవుతాయి

ఫోన్ చూడడం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, తల బరువుగా అనిపిస్తుంది

ఎక్కువ సేపు ఫోన్‌లో గడిపితే చిరాకు, సరిగ్గా ఆలోచించలేకపోవడం జరుగుతుంది

ఏ పనిపై శ్రద్ధ చూపకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి

నిద్రలేవగానే ఫోన్ చూస్తే అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి 

తప్పనిసరి ఫోన్ చూడాల్సి వస్తే.. నిమిషానికి కనీసం 15 సార్లు కళ్లను ఆర్పుతూ ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు