ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క..
రాత్రి సమయంలో కనిపించే ఈ లక్షణాలు కాలేయం దెబ్బతింటోందనడానికి సంకేతాలు.
రాత్రి సమయంలో నిద్రపోయేముందు శరీరమంతా లేదా కొన్ని ప్రాంతాలలో వివరీతమైన దురద ఏర్పడితే అది కాలేయం పాడవుతుందనడానికి సంకేతం.
చక్కని నిద్ర చక్కని ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కాలేయం ప్రమాదంలో ఉన్నట్టైతే నిద్రపోతున్న సమయంలో పదే పదే మెలకువ వస్తూ ఉంటుంది.
ఇలా పదే పదే నిద్రలో మెలకువ రావడం దీర్ఘకాలం కొనసాగితే దాన్ని కాలేయ సమస్యగా అనుమానించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యులను కలవడం మంచిది.
కాలేయ సమస్యలు ఉన్నట్టైతే చీలమండ, పాదం, కాలేయం చుట్టూ ఉన్న చర్మం మొదలైన ప్రాంతాలలో వాపు వస్తుంది
మూత్రం రంగును చూసి శరీరంలో జబ్బులను నిర్ణయిస్తుంటారు.
కాలేయం దెబ్బతినే అవకాశాలు ఉంటే మూత్రం రంగులో మార్పులు, మూత్రం దుర్వాసన రావడం వంటి సమస్యలుంటాయి. ఈ సమస్యను గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Related Web Stories
భోజనం చేసిన తరువాత అసలు చేయకూడని పనులు ఇవే..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు
చలికాలంలో అన్నం తింటే ఇన్ని లాభాలా..
పానీ పూరీ తింటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు..