ప్రపంచవ్యాప్తంగా కడుపు క్యాన్సర్ సర్వసాధారణమైన క్యాన్సర్లలో ఒకటి.

కడుపు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు, లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి.

అజీర్ణం, గుండెల్లో మంట అనేది కడుపు క్యాన్సర్ ప్రారంభ సంకేతం.

కడుపు ఉబ్బినట్లు లేదా నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది.

వికారం, వాంతులు కడుపు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు.

ఆకలి మందగించడం, తినాలనే కోరిక లేకపోవడం మరో లక్షణం.

కారణం లేకుండా బరువు తగ్గడం కడుపు క్యాన్సర్ సంకేతం కావచ్చు.

క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి రావొచ్చు.

రక్తపు వాంతులు, మలం ద్వారా రక్తం రావడం సంకేతం కావచ్చు.

అయితే ఈ సంకేతాలు, లక్షణాలన్నీ కడుపు క్యాన్సర్‌ను సూచించవు.

ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల సంభవించే అవకాశం ఉంది.