వేసవి కాలం వచ్చిందంటే విపరీతమైన దాహం వేస్తోంది. అత్యధిక శాతం మంది శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు.
వీటిని తాగడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వీటి బదులు జల్ జీరా తాగడం వల్ల దాహం తీరడంతోపాటు.. మరెన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులోని జీలకర్ర జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం, పీరియడ్స్ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు తదితర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెయిన్ కిల్లర్‌గా కూడా పని చేస్తుంది.
ఈ జల్ జీరా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఇనుమును అందిస్తుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
ఇలా తయారు చేసుకోవాలి.. వేయించిన జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, పుదీనా ఆకులు, కొద్దిగా పచ్చి మిర్చి కలిపి మెత్తగా రుబ్బాలి. దీనిని చల్లని నీటిలో కలపాలి.
ఈ నీటిలో తగినంత ఉప్పు, ఆమ్‌చూర్ పొడి, నిమ్మరసం కలపాలి. దీనిపై కొద్దిగా కారపు బుందీ చల్లుకుని తాగితే రుచి మరింత పెరుగుతుంది.