పాదాలలో మంటకు 8 ఇంటి చిట్కాలు.. !

కోల్డ్ వాటర్ సోక్.. పాదాలను చల్లటి నీళ్లలో లేదా ఐస్ బాత్ లో 15 నిమిషాల పాటు నానబెట్టండి. నరాలు తిమ్మిరి, మంటను తగ్గిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ బాత్.. 1/2 కప్పు ఎప్సమ్ సాల్ట్ ను గోరువెచ్చని నీటిలో కరిగించి 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాలను ఉంచి, కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రసరణ మెరుగవుతుంది.

క్యారియర్ ఆయిల్‌తో లావెండర్, పిప్పర్ మెంట్ లేదా యూకలిప్టస్ నూనెలు మసాజ్ చేయడానికి మంచి ఎంపిక.

ఆపిల్ సైడర్ వెనిగర్.. రెండు టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని గోరువెచ్చని నీటిలో వేసి, పాదాలను నానబెట్టడం వల్ల pH పాదాలలో వాపు తగ్గుతుంది.

కాలి కర్ల్స్, చీలమండ, ఫుట్ వ్యాయామాలను చేయాలి. 

ఆహారంలో పసుపును తీసుకోవడం వల్ల దానిలోని కర్కుమిన్ కంటెంట్‌ మంటను తగ్గించడానికి పనిచేస్తుంది.

అల్లం టీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తాజా అల్లంతో చేసిన టీని తాగాలి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. 

ఆలివ్ ఆయిల్‌తో పాదాలకు మసాజ్ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.