వేడి వాతావరణంలో ఊపిరితిత్తులను రక్షించుకోవడం ఎలా..!

వేడి వాతావరణంలో శరీరం ఉష్ణోగ్రతను తగ్గించడానికి కాస్త కష్టపడాల్సివస్తుంది.

వేడి వాతావరణంలో ముఖ్యంగా వేసవిలో వేడిని తట్టుకోవడం కష్టం అలాగే దాహం కారణంగా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.

శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నవారు వేడి వాతావరణం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు వేడి కారణంగా త్వరగా ఇబ్బంది పడతారు. 

 పువ్వుల పుప్పొడి నుంచి కూడా ఇబ్బంది మొదలువుతుంది. దీనితో దగ్గు, గురక వస్తాయి. 

అలర్జిక్ రినిటిస్ అనేది ఎగువ శ్వాస నాళాల వాపుకు దారితీస్తుంది. ఇది వేసవిలో ఎక్కువగా ఉంటుంది. 

వేడిగా ఉండే సమయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ బయటకు వెళ్ళకూడదు.

కిటికీలు, తలుపులు మూసే ఉంచాలి. ఏసీ, కూలర్ వంటివి ఉంచి ఇంటి లోపలే వేడి తగ్గే వరకూ ఉండాలి.

సరైన కాటన్ వస్త్రాలనే వాడటం మంచిది. ఇవి చెమటను పీల్చుకుని, ఇబ్బందిని తగ్గిస్తాయి.