రాత్రి పూట చపాతీ తింటున్నారా..?

చపాతీ తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంది. చపాతీల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

రాత్రిపూట చపాతీ తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రాత్రిపూట చపాతీ తినకూడదు.

రాత్రిపూట చపాతీ తినడం శరీరానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది తమ ఆహారంలో గోధుమ పిండితో చేసిన చపాతీకే ప్రాధాన్యతనిస్తారు.. ఒక సాధారణ చపాతీలో 120 కేలరీలు ఉంటాయి.

ఉదయం పూట మహిళలు రెండు చపాతీలు, పురుషులు మూడు చపాతీలు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చపాతీ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది.

మధుమేహం, పిసిఒడితో బాధపడుతున్న రోగులకు రాత్రిపూట చపాతీ తినడం పెద్ద సమస్యగా మారుతుంది. రోటీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.