చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ వండుకొని తింటారు. ఇక చికెన్ చాలా టేస్టీగా ఉండటం కోసం అందులో వివిధ రకాల ఇగ్రీడియన్స్ వేస్తారు.
చాలా మంది చికెన్‌లో పెరుగు వేసి వండుతుంటారు. కానీ చికెన్‌లో పెరుగు వేసి వండటం అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కర్రీ చిక్కగా, చాలా టేస్టీగా ఉండటం కోసం కొందరు పెరుగు కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదం ఉన్నదంట.
పెరుగు చల్లటి, పుల్లటి స్వభావం కలిగి ఉంటుంది. చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. అందువలన ఈ రెండింటి కలిపి తినడం వలన కడుపు సమస్యలు వస్తాయంట.
ముఖ్యంగా అజీర్ణం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.
చర్మ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదంట. చర్మంపై దుద్దర్లు, దురద, అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కాంబినేషన్ తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
అంతే కాకుండా కొంత మందిలో ఇది అధిక బరువు, వాతానికి కూడా కారణం అవుతుంది. అందువలన వీలైనంత వరకు చికెన్‌లో పెరుగు వేయకపోవడమే మంచిదంట.
Related Web Stories
అరటి తొక్క సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు..
పుట్టగొడుగులు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?
వామ్మో.. చేతులతో భోజనాన్ని కలుపుకుని తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
సిగరెట్ ప్యాకెట్ తాగితే ఎంత ఆయుష్షు తగ్గుతుందో తెలుసా?