వెజిటేరియన్స్‌ ఇవి తింటే మాంసాహారం లేకుండానే ప్రోటీన్ పొందవచ్చు..!

బ్రోకలిలో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వెజిటేరియన్స్‌ ప్రొటీన్‌ పొందాలంటే.. ఇది మంచి ఆహారం.

బఠానీలలో ప్రొటీన్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్‌ను నిరోధించడానికి సహయపడుతాయి. 

స్వీట్ కార్న్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. స్వీట్‌ కార్న్‌ తింటే.. రోజుకు అవసరమైన ప్రొటీన్‌లో దాదాపు 9 శాతం లభిస్తుంది.

కాలీఫ్లవర్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రొటీన్ పొందడానికి మీ డైట్‌లో కాలీఫ్లవర్‌ తీసుకోండి.

పాలకూరలో ప్రొటీన్‌, అమైనో యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను, కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

సబ్జా గింజలు మంచి ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉంటుంది.

బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ తీసుకోవడం మంచిది. వీటిలో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి.

రాజ్మా, బీన్స్, చిక్కుళ్లు, ఇతర కూరగాయల్లోనూ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు రాజ్మాతో 18 గ్రాములు, బఠాణీలతో 9 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.