హై బీపీ (అధిక రక్తపోటు) సమస్య ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతోంది.
దీనిని పూర్తిగా నయం చేయడం కష్టం అయినా.. ఆహారపు అలవాట్లు, సహజ ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.
పాలకూరతోపాటు ఇతర ఆకుకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ పోషకం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనం కలిగించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటి జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
అరటిపండులో సైతం పొటాషియం అధికంగా ఉంటుంది. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నారింజ, గ్రేప్స్, నిమ్మ వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సీ.. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో రక్తపోటు సహజంగా తగ్గుతుంది.
వెల్లుల్లిలో ఉండే పదార్థాలు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిని తగిన మోతాదులో మాత్రమే తినాలి.