చెడు కలలు ఎందుకు వస్తాయి..

 రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏదో పెద్ద ఎత్తు నుంచి పడిపోతున్నట్టుగా, పెద్ద చెట్టు విరిగిపోతున్నట్టుగా ఇలా చాలా రకాల చెడు కలలు వస్తాయి.

ఇలాంటి కలల వల్ల ఏదో చెడు జరగబోతుందని, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించడానికి సతమతం అవుతుంటారు.

నిజానికి దీని వెనుక రాత్రి మనం తీసుకునే ఆహారం చాలా వరకూ కారణమట.

దీనికి పరిష్కారం  ఏంటో చూద్దాం.

నిద్రపోయే ముందు తినే ఆహారం నిద్ర నాణ్యతను తగ్గించి, కలలను కనే విధంగా ప్రభావితం చేస్తుంది.

జాజికాయ చూర్ణాన్ని కలిపిన  పాలు తీసుకోవడం వల్ల అవి శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అరటిపండు మంచి నాణ్యమైన నిద్రను ఇస్తుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత,  పీడకలలు తగ్గుతాయి.

పీడకలలు వచ్చే అవకాశాలను తగ్గించడానికి, నిద్రవేళకు కొన్ని గంటల ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి.