పచ్చివి vs ఉడికించినవి మొలకలు..  ఎలా తింటే మంచిది..!

మొలకల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 పచ్చి మొలకలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇవి సరైన ఎంపిక. 

 ఉడకబెట్టిన మొలకలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఉడకబెట్టినవి తినడం ఉత్తమం.

పచ్చి మొలకలు ఎంజైమ్‌లు, విటమిన్లు, ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 

పచ్చి మొలకల్లోని కొన్ని పోషకాలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి.

పచ్చి మొలకలు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఉడకబెట్టి తినడం వల్ల మరికొన్ని ప్రయోజనాలున్నాయి. 

మీ శారీరక పరిస్థితిని బట్టి వాటిని తీసుకోవడం ఉత్తమం.