మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా  లేదా ఇలా నిర్ధారించుకోండి..

గుండె మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. గుండె పనితీరును బట్టే మనిషి ఆయుష్షును నిర్ణయిస్తారు. 

నేటి కాలంలో గుండెకు రక్తం సరఫరా సరిగా లేక గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలే ఎక్కువ ఉంటున్నాయి. 

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకైనప్పుడు లేదా అడ్డంకిగా మారినప్పుడు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలవబడే హార్ట్ బ్లాకేజ్ సమస్య వస్తుంది.

ఈ సమస్య ప్రధానంగా కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్, ఇతర పదార్ధాల చేరడం వల్ల ధమని గోడలలో ఫలకాలు ఏర్పడతాయి.

ఈ ఫలకాలు గట్టిపడటం, చీలిపోవడం వంటివి జరగడం వల్ల గుండె కండరాలకు రక్త ప్రసరణను తగ్గుతుంది.

దీని వల్ల ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇలా ఏర్పడే సమస్యను ఆంజినా అని అంటారు.

ఈ సమస్య ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజంతా చురుగ్గా ఉండటం వల్ల గుండె సంబంధ సమస్యలను అధిగమించవచ్చు.