ఆకుకూరల్లో అనేక  పోషకాలు ఉంటాయి.

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.

పాలకూరలో రక్త శుద్ధి చేసే లక్షణాలు పుష్కలంగా ఉండి ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను రాకుండా కాపడుతుంది. ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.

మెంతి కూర బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనితో పాటు, ఇందులోని ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు జుట్టు రాలడం సమస్యను తొలగిస్తాయి.

పుదీనా శ్వాసకోశ సమస్యలను కూడా నివారిస్తుంది. కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది చక్కెర, అధిక బరువు, మలబద్ధకం సమస్యలను నియంత్రిస్తుంది.

కొత్తిమీర వంటకాలకు రుచి, సువాసనను జోడించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

పాలకూర:విటమిన్లు ఎ, బి, సి, కె, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ ఖనిజాలు, మెంతి కూర: ఫైబర్, ప్రోటీన్, ఐరన్, సోడియం, రాగి, భాస్వరం, జింక్ విటమిన్లు, పుష్కలంగా ఉంటుంది

పుదీనా: విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ కరివేపాకు:యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్  కొత్తిమీర: ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్ల,ఇనుము, మాంగనీస్  పుష్కలంగా ఉంటుంది