వేసవి కాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి.

 ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగాలి. అయితే ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

మీరు ఎక్కువ వ్యాయామం లేదా శారీరకంగా కష్టతరమైన పని చేసేవారైతే ఇంకా ఎక్కువ నీరు తాగవలసి ఉంటుంది

 వేడి వాతావరణంలో నివసించే ప్రజలు కూడా అధిక మోతాదులో నీరు తీసుకోవాలి.

ఎండాకాలంలో పదే పదే దప్పికగా ఉందని అవసరానికి మించి నీరు తాగటం మంచిది కాదు.

కొన్నిసార్లు వాటర్ పాయిజనింగ్ కారణంగా శ్వాసక్రియకు తీవ్ర ఆటంకం కలగవచ్చు.

మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తప్పక తీసుకోవాల్సిందే.