అల్లం నీరు వల్ల ఇన్ని లాభాలా..

అల్లం ఒక సహజమైన ఆయుర్వేద ఔషధం. కొన్ని శతాబ్దాలుగా పలు అనారోగ్య సమస్యలకు చికిత్సగా వీటిని  ఉపయోగిస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న అల్లం ఆరోగ్యానికి ఒక వరం.

ఉదయం నిద్ర లేవగానే.. ఖాళీ కడుపుతో అల్లం నీరు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.

అల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గుతో పోరాడటానికి సహాయపడతాయి. 

నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉంటాయి.

అల్లం.. ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 

అల్లం నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అల్లం నీరు తాగడం వల్ల మలబద్ధకం, అతిసారం, గ్యాస్ తదితర సమస్యలను నియంత్రించవచ్చు.

అల్లం నీరు తాగడం వల్ల మెటబాలిజం పెంచుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో అల్లం నీరు అద్భుత ఔషధంగా పని చేస్తుంది.

అల్లం నీరు వాంతులు, వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లం నీరు మన జీవక్రియను పెంచడమే కాకుండా బరువును నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.