పోటీ ప్రపంచంలో ఉద్యోగ రీత్యా ఎక్కువ సేపు కూర్చొవాల్సి వస్తోంది.

అలా గంటలు గంటలు కూర్చుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది.

రక్త నాళాలు గట్టిపడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులకు కారణం అవుతుంది.

టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఎక్కువ సేపు కూర్చోవడంతో జీవక్రియ మందగించి బరువు పెరుగుతారు.

వెన్ను, మెడపై ఒత్తిడి పెరిగి వెన్ను నొప్పి, మెడ నొప్పికి దారితీస్తుంది.

పెద్దపేగు, ఎండోమెట్రియల్ వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి తగ్గుతుంది.