బయటకు అడుగు పెడితే చాలు జుట్టుపై దుమ్ము, దూళి పేరుకుపోతాయి .

మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. మన చర్మం, జుట్టును కూడా దెబ్బతీస్తాయి.

పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య పెరుగుతోంది

జుట్టు రాలడం అనే సమస్య ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలంటే మీరు లవంగం స్ప్రేని ఉపయోగించవచ్చు.

లవంగం యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్ మూలకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది.

జుట్టును పోషణను అందించి జట్టును బలంగా చేయడంలో కూడా మేలు చేస్తుంది.

ఈ స్ప్రే తయారు చేయడానికి.. మీరు 10 లవంగాలను తీసుకుని కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి.

10 నిమిషాలు మరిగిన తర్వాత.. చల్లబరచడానికి పక్కన పెట్టుకొని అనంతరం ఈ నీటిని వడకట్టి ఒక సీసాలో స్టోర్ చేయండి.