HMPV వైరస్ కలకలం..  అందరూ తెలుసుకోవాల్సినవి ఇవే.. 

హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV) ప్రస్తుతం చైనాలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇది మానవ శ్వాస వ్యవస్థను దెబ్బ తీస్తుంది. 

కర్ణాటకలో ఇద్దరికి ఈ హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ సోకినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్పష్టం చేసింది. 

కరోనా తరహాలోనే హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ సోకిన వారు కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

ఇది కరోనా వైరస్ వలె కొత్త రకం వైరస్ కాదు. దీనిని 2001లోనే కనుగొన్నారు. ఈ వైరస్ సోకిన చాలా మంది త్వరగానే కోలుకుంటారు. 

కొద్ది మంది మాత్రమే తీవ్రమైన న్యూమోనియా బారిన పడి హాస్పిటల్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది. 

ఈ హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన యాంటీ వైరల్ మందులు ఇప్పటివరకు లేవు. 

ఈ వైరస్ సోకకుండా మాస్క్‌లు ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ వైరస్ సోకిన తర్వాత  తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.