ఎముకల నొప్పులు  తగ్గాలంటే...!

 పాలు, పెరుగు, ఛీజ్‌లలో అధికంగా కాల్షియం కొద్ది మోతాదులో డి విటమిన్‌ ఉంటాయి. 

వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలోపేతమవుతాయి. 

బీన్స్‌లో ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం అధికంగా ఉంటాయి. 

వీటిని కూర లేదా సలాడ్‌ రూపంలో తరచూ తినడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.

సాల్మన్‌ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. 

 ఇవి ఎముకల్లో నొప్పిని, మంటను తగ్గిస్తాయి. 

అవకాడో తినడం వల్ల ఎముకల్లో వాపు, మంట తగ్గుతాయి.

బాదం పప్పులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇ విటమిన్‌, పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 

ఇవి ఎముకలు క్షీణించకుండా కాపాడతాయి.