పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు
పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలని, ఎత్తు, బరువును చూడాలని చెబుతున్నారు.
శరీరం బరువు తగ్గాలంటే రోజూ అవసరమయ్యే క్యాలరీలకంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి.
పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలి.
మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ప్రతి మూడు నాలుగు గంటలకు ఓసారి ఏదైనా ఆహారం ఇవ్వడం మంచిది.
రోజువారీ ఆహారంలో ధాన్యాలు (అన్నం, గోధుమ రొట్టె, చిరుధాన్యాలతో చేసిన జావలు మొదలైనవి), పప్పు ధాన్యాలు, గింజలు (ఆక్రోట్, బాదం, పల్లీ, జీడిపప్పు మొదలైనవి)
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి తప్పని సరిగా ఉండాలి.
వారానికి మూడు నాలుగు సార్లు గుడ్లు, ఓసారి చికెన్, చేపలాంటివి చేరిస్తే మంచిది.
బేకరీ స్నాక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, తీపి పదార్థాలు (స్వీట్లు, కేకులు, ఐస్‌క్రీమ్స్ మొదలైనవి), చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటివి మాత్రం అస్సలు అలవాటు చేయకూడదు.