తక్కువ నూనె‍తో  వంట చేయటం ఎలా?

వంట చేసేటప్పుడు నూనెను నేరుగా బాటిల్‌తో కాకుండా చెంచాతో కొలిచి వేయడం అలవాటు చేసుకోవాలి.

మూకుడు నిండుగా నూనె పోసి చేసే వంటకాలకు బదులు ఆవిరి మీద ఉడికించి చేసే అల్పాహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

 అప్పడాలను నూనెలో వేయించకుండా సన్నని మంట మీద కాల్చుకుని తినవచ్చు.

డీప్‌ ఫ్రైకి బదులు షాలో ఫ్రై, రోస్ట్‌, బేకింగ్‌, గ్రిల్లింగ్‌, స్టీమింగ్‌ పద్ధతులను అనుసరించాలి.

దోశలు చేసేటప్పుడు పెనం మీద చెంచాతో నూనె రాయడానికి బదులు ఒక పెద్ద ఉల్లిపాయను మధ్యకు కోసి దానితో రుద్దితే చాలు.

నెలకి ఎంత నూనె వాడుతున్నామో ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవాలి.

దీనివల్ల నూనె వాడకంపై  ఒక అవగాహన వస్తుంది.