మీ జుట్టు బాగా ఊడిపోతోందా? వెంటనే ఈ టెస్ట్‌లు చేయించండి..
మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? అయితే మీరు వెంటనే ఐదు రకాల బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలి.
కంప్లీట్ బ్లడ్ టెస్ట్ (సీబీసీ) చేయించుకుంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు ఏ మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది.
జుట్టు ఊడిపోవడానికి కారణమయ్యే రక్త హీనత (ఎనీమియా) ఉందేమో సీబీసీ టెస్ట్ ద్వారా బయటపడుతుంది.
విటమిన్ డి, విటమిన్ బి12 శరీరంలో ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షించే విటమిన్స్ టెస్ట్ చేయించుకోవాలి.
విటమిన్ డి, విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా హెయిర్ ఫాల్ మొదలవుతుంది.
ఐరన్ ప్యానల్, సీరమ్ ఫెర్రిటిన్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటారు.
హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే హార్మోన్లను థైరాయిండ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది.
సి-రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్‌పీ) టెస్ట్ కూడా చేయించుకోవాలి.
సీఆర్‌పీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అది కూడా హెయిర్ ఫాల్‌కు ఓ కారణం కావచ్చు.
Related Web Stories
టీలో దాల్చిన చెక్క కలిపి తాగితే ఎమవుతుందో తేలుసా..
సొరకాయతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే..
తాటి ముంజులు తింటే ఎన్ని లాభాలో
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?