మెదడుకు అవసరమైన పోషకాలు అందకపోతే జ్ఞాపకశక్తి మందగిస్తుంది.

అందుకే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

అయితే ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే జ్ఞాపకశక్తికి పదును పెట్టొచ్చని తెలుసా..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్ ఎక్కువగా తినాలి.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్లు, 5-6 బాదం గింజలు తినాలి.

మెంతులు, జీలకర్ర రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగాలి.

తులసి, అశ్వగంధ, బ్రాహ్మి వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి మెదడు శక్తిని పెంచే సహజమైన ఆయుర్వేద మూలికలుగా పనిచేస్తాయి.

సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర.. జ్ఞాపకశక్తి మందగించకుండా చేస్తాయి.