పైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..  ఈ ఆకుతో సింపుల్ చికిత్స..

రణపాల ఆకులో అనేక దివ్య ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆయుర్వేదంలో చాలా కాలంగా రణపాల మొక్కను అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వినియోగిస్తున్నారు.

రణపాల మొక్క ఆకులు మందంగా, వగరు, పులుపు కలిగి ఉంటాయి. 

ఈ మొక్కలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ మొక్కను ఉపయోగించడం వల్ల బీపీ, షుగర్ తదితర వ్యాధులు అదుపులో ఉంటాయి.

మూత్ర సంబంధ సమస్యలను ఈ రణపాల మొక్కను ఉపయోగించి నయం చేయవచ్చు.

అంటువ్యాధులు, గాయాలు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడే వారికి రణపాల అద్భుతమైన మూలికా ఔషధంగా పనిచేస్తోంది.

ఈ ఆకులో టీ తయారు చేసుకుని తాగడం వల్ల తిమ్మిర్లు, ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

ఈ ఆకుల‌ను పేస్ట్‌గా చేసుకొని లేపనంగా రాసుకోవ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి తదితర స‌మ‌స్యలు దూరమవుతాయి.

మొల‌ల స‌మ‌స్యతో బాధ‌పడే వారు మిరియాలతో కలిపి ర‌ణ‌పాల ఆకుల తీసుకుంటే.. ఈ సమస్య నుంచి త్వరగా బ‌య‌ట‌ప‌డ‌ వచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రణపాల మొక్క శాస్త్రీయ నామం.. బ్రయోఫిలమ్  పిన్నటం