రోజు రోజుకి కంటి చూపు తగ్గుతోందా.. ఉదయమే ఇలా చేసి చూడండి..

రోజు దృష్టిని మెరుగుపరచుకోవడానికి ఉదయం నిద్రలేచిన వెంటనే చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం.

 ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోకుండా చల్లటి నీటితో కళ్ళను బాగా కడుక్కోండి.

ఇలా చేయడం వలన కళ్ళ వాపు తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

సూర్యోదయం సమయంలో.. అంటే లేలేత సూర్య కిరణాలను కొన్ని సెకన్ల పాటు చూడటం వల్ల కంటి కండరాలు బలపడతాయి.

ఈ ప్రక్రియ పూర్తిగా సూర్యోదయానికి 10-15 నిమిషాల ముందు మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.

ఉదయం నిద్రలేవగానే కొన్ని కంటి వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా కంటి చూపును కూడా మెరుగుపరచవచ్చు.

కళ్ళను పైకి-క్రిందికి, కుడి-ఎడమకు కదిలించడం, రెప్పవేయడం వంటివి కంటి కండరాలను ఉత్తేజపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలతో ఒక టీస్పూన్ బాదం, పటిక బెల్లం, సోంపు పొడిని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.