అలాగే ఈ ఆకులో విటమిన్ ఎ, సి, కెరొటినాయిడ్స్, లినోలియిక్, ఒలియిక్ లాంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇన్ని ఔషధ గుణాలున్న వేప ఆకును పరగడుపున తినడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. ఆర్ధరైటిస్ సమస్య నుంచి
బయటపడ వచ్చు.
ఈ ఆకులు నమిలి తినడం వల్ల శరీరంలో మెటబోలిజం మెరుగుపడుతుంది. ఆకలి క్రమబద్ధీకరణ అవుతుంది. బరువు నియంత్రణకు దోహదపడుతుంది..
ఈ ఆకుల సారాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఎన్నో రకాల అంటువ్యాధులు దరి చేరవు.
డయాబెటిస్ రోగులకు వేప ఆకు చాలా మంచివి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వీటిని తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు క్రమంగా దూరమవుతాయి.
ఈ ఆకులోని పోషకాల వల్ల నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. మెదడుకు ఉపశమనం కలుగుతుంది.
వీటిని ప్రతిరోజూ నమలడం వల్ల నోరు పరిశుభ్రమవుతుంది. పరగడుపున తీసుకోవడం సెలైవా ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో నోట్లో బ్యాక్టీరియా ఉండదు.కేవిటీ సమస్య సైతం దూరమవుతుంది.
వేప ఆకులో చేదు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్స్, మలినాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
ఈ ఆకులు తినడం వల్ల కొన్ని రోజుల్లోనే చర్మం నిగారింపు అవుతుంది. మొటిమలతో ఇబ్బంది పడే వారు.. ఈ ఆకు తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది.