చికెన్, మటన్‌లో కంటే వీటిలో పోషకాలు సూపర్

ఆ కాకరకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా వీటిని వర్షం కాలంలో తినడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ఆ కాకరకాయను బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారు.

మాంసహారం చికెన్, మటన్‌లో కూడా లభించనన్ని పోషకాలు వీటిలో లభిస్తాయి.

ఆ కాకరకాయ తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవని అంటారు.

వీటిలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు వీటిని డైట్‌లో చేర్చుకోవాలని చెబుతారు.

అంతేకాదు.. ఆ కాకర కాయను కూరగాయల్లోనే కింగ్‌గా అభివర్ణిస్తారు.

వీటిలో విటమిన్స్, అమైనో అమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. అందుకే వీటిని వర్షకాలంలో తీసుకోవాలంటారు.

వీటిలో గ్లైసెమిక్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుందంటారు.

ఇక ఆ కాకరకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. ఆ కాకరను తిసుకోవడం వల్ల క్యాన్సర్ తరహా అనారోగ్య సమస్యలు దరి చేరవని చెబుతారు.

ఆకాకరకాయ.. రక్త పోటును తగ్గించి, గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

వీటిలో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల బలానికి ఇది చాలా మంచిది. జలుబు, దగ్గు,వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కలిపిస్తుంది.

బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది దివ్యఔషధం. దీనిని ప్రతి రోజూ తినడం వలన బరువును నియంత్రిస్తుంది.

ఆకాకరకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకుంటే.. ఇది కడుపు నిండిన భావన కలిగి అధిక ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగు పరుస్తుంది.