దుంప కూరల్లో  బీట్‌రూట్ ఒకటి.

రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్ ని తినడం వల్ల ప్రయోజనం పొందుతారు.

ఈ బీట్‌రూట్‌ను తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

బీట్‌రూట్‌ను ఉడికించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

. ఉడికించిన బీట్‌రూట్ శరీరానికి అవసరమైన నైట్రేట్లు లభిస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. ఫోలేట్ కణాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం వల్ల దాని యాంటీఆక్సిడెంట్లు, బీటాలైన్‌ల కారణంగా వాపు తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చి బీట్‌రూట్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.