ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే.. ఇన్ని లాభాలా..
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ఉండే విటమిన్లు సీ, ఏ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీర అలసటను తొలగించి అవసరమైన శక్తిని అందిస్తుంది.
ఎండిన ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవటం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి.
నానబెట్టిన ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకున్నట్టయితే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ఖర్జూరాలలో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన ఖర్జూరం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Related Web Stories
ఒరి నీ.. ఐస్ క్రీమ్ వల్ల ఇన్ని లాభాల
ఈ ఆహార పదార్థాలు పంటి నొప్పికి కారణమవుతాయి..
రాత్రి పూట కీరదోస తింటున్నారా ?
ఉదయాన్నే మిల్లెట్ కిచిడీ తినడం వల్ల కలిగే లాభాలు..