ఈ ఆహార పదార్థాలు పంటి నొప్పికి కారణమవుతాయి..

 ఏ ఆహార పదార్థాలు పంటి నొప్పికి ఎక్కువ కారణమవుతాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐస్ క్రీం చల్లగా ఉండే ఆహార పదార్థాలలో ఒకటి. దానిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల నొప్పి వస్తుంది.

సున్నితమైన దంతాలు ఉన్నవారు దీన్ని తినడం వల్ల మరింత ఇబ్బంది పడతారు.

బీరు లేదా వైన్ తీసుకోవడం వల్ల దంతక్షయం పెరుగుతుంది. ఆల్కహాలిక్ పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది

 కాఫీలోని ఆమ్లత్వ స్థాయి, చక్కెర సున్నితమైన దంతాలు ఉన్నవారికి నొప్పిని కలిగిస్తాయి.

నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, టమోటాలు వంటి సిట్రస్ పండ్లు, వెనిగర్ ఉన్న ఆహారాలు ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇది పంటి నొప్పికి కారణమవుతుంది.