ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతారు. వయస్సు 40 ప్లస్‌లోకి వచ్చిందంటే.. ఉప్పు తినాలంటే ప్రతి ఒక్కరు కాస్తా వెనుక ముందు ఆలోచిస్తారు.
ఉప్పు బదులు పింక్ సాల్ట్ తీసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఉప్పు కంటే.. ఈ పింక్ సాల్ట్‌లో అధిక పోషకాలున్నాయని చెబుతున్నారు.
ఈ పింక్ సాల్ట్‌లో అధిక పోషకాలుంటాయని పేర్కొంటున్నారు.
సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్‌లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతోపాటు 80 రకాల మినరల్స్ ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
తెల్ల ఉప్పులో కంటే పింక్ సాల్ట్‌లో సోడియం స్థాయి తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. రక్తపోటుతో ఇబ్బంది పడుతూ తక్కువ సోడియం తీసుకోవాలనుకునే వారికి ఇది మంచిదంటున్నారు.
సాధారణంగా ఉప్పు శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే పింక్ సాల్ట్ అయితే బాడీని తేమగా ఉంచుతూ.. ఎలక్ట్రోలైట్ల స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుందని వివరిస్తున్నారు.
శరీరంలోని మలినాలను తొలగించి డిటాక్సిఫయింగ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇంకా శరీరం కొత్త ఉత్తేజాన్ని పొందుతుందంటున్నారు.
ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు పింక్ సాల్ట్ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఆహారం తేలికగా జీర్ణం కావడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు.
పింక్ సాల్ట్‌లో అధిక సంఖ్యలో ఎలక్ట్రోలైట్లు ఉండడంతో శరీరంలోని పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని అంటున్నారు. దీంతో శరీరం పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
చర్మంపై మృత కణాలను తొలగించడంతో పాటు యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరం నుంచి వచ్చే చెడు వాసననూ దూరం చేస్తుందని తెలిపారు.
ఈ పింక్ సాల్ట్.. సహజ పద్ధతుల్లోనే ప్రాసెస్ చేస్తుంటారు. సాధారణ ఉప్పను పూర్తిగా రిఫైండ్ చేసి తెల్లగా కనిపించేందుకు రసాయనాలు కలుపుతారని చెబుతున్నారు.