కర్బూజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, సోడియం, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, నియాసిన్‌తోపాటు కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయని అంటున్నారు.
వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు.
వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతోంది.
కర్బూజాలో అధిక మొత్తంలో పోటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తోంది. వీటిలో అధికంగా పీచు ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తోంది.
ఈ పండు తియ్యిగా ఉంటుంది. ఇందులో కేలరీలు స్వల్పంగా ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకున్న చాలా మంచిది.
వీటిని తీనడం వల్ల హార్ట్ బిట్‌ను సాధారణంగా ఉంచుతొంది. మెదుడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతోంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
గుండె సమస్యలతో ఇబ్బంది పడే వారిని కర్బూజా తీసుకోవడం శ్రేయస్కరం. ఈ పండులో యాంటీకోయాగుల్యేషన్ గుణాలు ఉంటాయి. వీటిలో అడెనోసిన్... రక్తం పలచబడడానికి సహాయ పడుతోంది.
ఇవి తీసుకోవడం వల్ల కంటిలోని శుక్లాలను నివారిస్తోంది. కంటి చూపును మెరుగు పరుస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. క్యాన్సర్ లక్షణాలను నిరోధిస్తుంది.