జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.
జామకాయలో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా ప్రీ డయాబెటిక్‌లకు రక్తంలో చక్కెర స్థాయిను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ జామకాయ పచ్చడిలో పొటాషియం, ఫైబర్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడం.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా.. యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇందులో తక్కువ కేలరీలు, అధికంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ జామకాయ పచ్చడి మంచి ఆహారం.
ఈ జామకాయ పచ్చడి మితంగా తీసుకోవాలి. ఎందుకంటే మితిమీరి తీసుకోవడం వల్ల.. అధిక ఫైబర్ కారణంగా కొంతమందిలో కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.
జామకాయలు.. చాలా తక్కువ ధరకు లభిస్తాయి. వీటిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. స్వల్ప ధరలతో.. అధిక పోషకాలు అందేవి ఏమైనా ఉన్నాయంటే.. అవి జామకాయలే.