గ్యాస్ సమస్య వేధిస్తోందా?  ఈ టిప్స్ పాటించండి..

గ్యాస్ట్రిక్ సమస్యలకు అల్లం మంచి ఔషధం. జీర్ణక్రియ సజావుగా సాగడానికి అల్లం శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. 

జీర్ణ సమస్యలను తగ్గించేందుకు జీలకర్రను ఉపయోగించడం ఆయుర్వేదంలో ఎప్పట్నుంచో ఉంది. 

అల్లం, ఎండుమిర్చి, మిరియాలు కలిపిన త్రికటు చూర్ణం పరగడుపున తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. 

వాము వంటింటి దివ్య ఔషధం. పరగడుపున కాస్త వాము నీళ్లు తాగినా, వాము వేసుకుని అన్నం తిన్నా గ్యాస్ట్రిక్ సమస్య దూరమవుతుంది. 

బీన్స్, ఉల్లిపాయలు, క్యాబేజీ, కార్బొనేటెడ్ పానియాలకు దూరంగా ఉండండి. మసాలా, వేపుడు పదార్థాలు తీసుకోకండి.

రోజూ ఒకే సమయానికి భోజనం చేయండి. ఆహారాన్ని నెమ్మదిగా నిమిలి తినండి. రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం ముగించండి.

యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. 

ఇంగువ కడుపులోని గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధం.