శరీరానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతాయిని అంటున్నారు. అయితే ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో సొంతంగా ఉత్పత్తి కావు. వీటిని ఆహారం ద్వారా పొందాలి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లం.. చేపల్లో అధికంగా ఉంటుంది.
కొంత మంది చేపలు తినరు. అటువంటి వాళ్లు చేప నూనెతో తయారు చేసిన సప్లిమెంట్స్ తీసుకుంటారు.
చేప నూనెలో విటమిన్లు ఏ, డి ఉంటాయి.
చేపలు అధికంగా తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా స్వల్పమని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.
చేపలు లేదా చేప నూనె తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయి. అలాగే అనేక గుండె సంబంధిత సమస్యలు సైతం తగ్గుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కంటి సమస్యలను నయం కావడంలో సైతం సహాయపడుతుంది.
చేప నూనెలో శోథ నిరోధక లక్షణాలున్నాయి.ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చేప నూనె చర్మానికి చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మంపై సహజమైన మెరుపును తెస్తుంది. దీని వినియోగం వల్ల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
అలాగే చర్మ కణాలు పునరుత్పత్తి చేయబడతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయకారిగా పని చేస్తుంది. అదే సమయంలో చేప నూనె జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టుని బలంగా, ఒత్తుగా చేస్తుంది.
చేప నూనె తీసుకోవడం వల్ల కాలేయ పని తీరు మెరుగవుతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలను, కాలేయంలోని కొవ్వు పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
చేప నూనె తీసుకోవడం వల్ల మెదడు పదునుగా తయారవుతుంది.