తమలపాకులతో కలిపి మెంతులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..!
మెంతులు, తమలపాకులు కలిసి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తమలపాకులు, మెంతులలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వీటిని కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందని అంటోంది.
మెంతి గింజలలో గ్లూకోసమైన్ ఫైబర్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. తమలపాకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతోంది. ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనాన్ని కలిగిస్తోంది.
మెంతులు స్త్రీ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తమలపాకులు గర్భాశయాన్ని శుభ్రంగా ఉంచడంతోపాటు ఋతు క్రమంలో వచ్చే నొప్పిని సైతం నియంత్రిస్తుంది.
తమలపాకులో యాంటీ-మైక్రోబయల్, జీర్ణ లక్షణాలుంటాయి. మెంతులు ఫైబర్, యాంటీ యాసిడిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకొంటే అసిడిటీ,అజీర్ణ సమస్యలు తొలుగుతాయి.
మెంతులు రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. తమలపాకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది కీళ్ల వాపు, నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది.
తమలపాకులో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలోని క్రిములను చంపుతోంది. మెంతులు నోటి వాపు, పూతల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు, రాత్రి నానబెట్టిన ఒక టీ స్పూన్ మెంతులు కలిపి తీసుకోవాలి. బాగా నమిలి మింగాలి. అనంతరం గోరు వెచ్చని నీటిని తాగాలి.