రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీరతోపాటు ధనియాల పొడిని కూరల్లో విరివిగా వాడతారు. ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఆ మర్నాడు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల రెట్టింపు ఆరోగ్యం ఉంటుంది.
ఖాళీ కుడుపుతో నానబెట్టిన ధనియాలు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ధనియాల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినాల్ ఆరోగ్యానికి సహకరిస్తుంది. దాంతో కంటి సమస్యలు దూరమవుతాయి.
ధనియాల నీటిలో విటమిన్ ఏ,సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
ధనియాలు నానబెట్టిన నీటిని ఇలా పరగడుపున తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. ధనియాలు నీటిలో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.