మహిళల్లో అన్ని అనారోగ్య సమస్యలకు.. ఈ పండుతో చెక్..

డ్రాగన్ ఫ్రూట్ రుచికరమైనది మాత్రమే కాదు.. పోషకాల స్టోర్‌ హౌస్‌ అని పోషకాహార నిపుణులు చెబుతారు. 

వీటిలో ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌‌తోపాటు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. 

విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల ఈ పండు ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. అలాగే బి1, బి2, బి3 విటమిన్లు సైతం అధికంగా ఉన్నాయి.

మహిళలకు ఈ పండు వరం లాంటిదని పేర్కొంటున్నారు.

ఈ ఫ్రూట్‌లోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. మహిళల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తాయి. 

మహిళలకు ఐరన్ చాలా అవసరం. నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా వారిలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశముంది. 

వీటిలో అధిక మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల ఇది రక్తహీనతను నివారిస్తుంది. అలాగే శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని భారీగా పెంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు బలపడుతాయి. ముఖ్యంగా మహిళలు మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు ఆస్టియో పోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకల ఆరోగ్యం కోసం మెగ్నీషియం అవసరం.

ఈ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. దీని వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగు ఆరోగ్యం సైతం మెరుగవుతుంది.

ఈ ఫ్రూట్‌లో విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే అంటువ్యాధులు దరి చేరవు.

ఈ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. 

ఈ పండులో ఉండే విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని వల్ల చర్మం స్థితి స్థాపకత పెరుగుతుంది. 

ఈ ఫ్రూట్‌లో ఉండే ఫోలేట్.. గర్భిణీలకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది గర్భంలో ఉన్న శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో ఉండే ఐరన్ గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.