సీతాఫలం గింజలతో ఇన్ని లాభాలా..
సీతాఫలాన్ని అంతా ఎంతో ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు ఆరోగ్యానికి సైతం ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.
సీతాఫలం గింజలను పడేస్తుంటాం. కానీ వీటి వల్ల బోలెడ్ లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ గింజలను ఎండబెట్టి పొడిగా మార్చి తీసుకుంటే పలు లాభాలు కలుగుతాయని అంటున్నారు.
ఈ గింజల్లో విటమిన్ ఏ, కే, సీ, బి వన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో జింక్, ప్రోటీన్లతోపాటు కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఈ గింజల పొడిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసీడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
వీటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధక సమస్య దూరమవుతుంది.
సీతాఫలం గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ గింజల్లోని విటమిన్ సి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఈ గింజల పొడిని తీసుకోవాలి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సీతాఫలం గింజలు ఉపయోగపడతాయి.
సీతాఫలం గింజల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కదుళ్లను బలోపేతం చేస్తుంది.
ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.
Related Web Stories
టీలో యాలకులు వేసి తాగుతున్నారా..
తమలపాకులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరమైనట్లే..
రోజూ పెరుగు తినే వారు ఈ విషయాలను అస్సలు మర్చిపోకూడదు
ఈ జ్యూస్లు తాగితే.. మీ బీపీ కంట్రోల్ అవుతుంది..!